ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా, ఫీట్ గా ఉండాలి అంటే డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే 6 ఆహారాలు కచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
మరి ఆ ఆరు ఆహారాలు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్.
డైలీ డైట్ లో ఉండే ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి.రోజుకు ఒక క్యారెట్( Carrot ) తింటే కంటి చూపు రెట్టింపు అవుతుంది.
నరాల బలహీనత దూరం అవుతుంది. జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి పెరుగుతాయి.
అలాగే ఒక కప్పు పెరుగును రోజు తీసుకోవాలి.పెరుగు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది.
పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.

డైలీ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన ఆహారాల్లో కరివేపాకు ( Curry leaves )ఒకటి.రోజుకు రెండు రెబ్బలు కరివేపాకును తీసుకుంటే రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఖర్జూరం.పోషకాల నిలయం.
నిత్యం రోజుకు మూడు లేదా నాలుగు ఖర్జూరం పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా ఖర్జూరంలో( Dates ) ఉండే పోషకాలు మూత్ర సంబంధిత వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
రోజు నాలుగు ఖర్జూరం పండ్లు తింటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అలాగే కీరదోసకాయను ( Cucumber )నిత్యం తీసుకునేందుకు ప్రయత్నించాలి.కీర దోసకాయ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.అదే సమయంలో కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెకు ముప్పును తగ్గిస్తుంది.
ఇక రెగ్యులర్ డైట్ లో కచ్చితంగా ఉండవలసిన ఆహారాల్లో అల్లం కూడా ఒకటి.నిత్యం అర అంగుళం అల్లం ముక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి.
అల్లం వల్ల మలబద్ధకం వేధించకుండా ఉంటుంది.జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు శరీర బరువు సైతం అదుపులో ఉంటుంది.







