వీడియో: ఫారెస్ట్ ఉద్యోగిని కాళ్ల కింద పడేసి తొక్కేసిన ఏనుగు.. శరీరం నుజ్జునుజ్జు!

సాధారణంగా మాంసాహార జంతువులు మనుషులకు ఎదురుపడినప్పుడు వారిపై దాడి చేస్తారు.శాఖాహార జంతువులైనా అవి ఒక్కోసారి చాలా క్రూరంగా మారతాయి.

 Video: An Elephant Trampled A Forest Employee Under His Feet His Body Was Crush-TeluguStop.com

కనిపించిన మనుషులపై భయంకరమైన దాడులు చేస్తూ ప్రాణాలను తీసేస్తుంటాయి.ఈ మధ్యకాలంలో ఆవులు, ఏనుగులు మనుషులపై ఎక్కువగా అటాక్స్‌ చేస్తున్నాయి.

ముఖ్యంగా అడవిలో ఉండే ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి.వారి ప్రాణాలకు, ఆస్తికి నష్టం కలిగిస్తున్నాయి.

ఇటీవల మహారాష్ట్ర( Maharashtra )లోని గడ్చిరోలి జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువయింది.శనివారం కొన్ని అడవి ఏనుగులు పలాస్‌గావ్‌ అడవుల్లోకి ప్రవేశించాయని గ్రామస్థులు అటవీ శాఖకు తెలిపారు.

దాంతో అధికారులు వాటిని అక్కడ్నుంచి వెళ్లగొట్టేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అటవీశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్( Sudhakar ) బి ఆత్రం అటవీ శాఖ అధికారులను ఆ ప్రాంతానికి ఒక వాహనంలో తీసుకొచ్చాడు.

అనంతరం వెహికల్ పక్కన పార్క్ చేశాడు.కొద్దిసేపటికి ఓ ఏనుగును చూసి దాన్ని తన కెమెరాలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు.అయితే అప్పటిదాకా కామ్‌గా ఉన్న ఆ ఏనుగు ఒక్కసారిగా పొదల్లో నుంచి దూసుకు రావడం ప్రారంభించింది.అది గమనించిన అటవీశాఖ అధికారులు ఉరుకుల పరుగులు తీయడం మొదలుపెట్టారు.

డ్రైవర్ సుధాకర్ మాత్రం అది దగ్గరికి వస్తున్నా త్వరగా ఉరకలేదు.

కానీ ఏనుగు మాత్రం వేగంగా అతనిపైకి దూసుకు వచ్చింది.ఈ క్రమంలోనే సుధాకర్ కింద పడిపోయాడు.అంతే ఏనుగు ఒక్క ఉదుటున అతడిని చేరుకుంది.

ఆపై సుధాకర్ పై కాలు వేసి తొక్కేసింది.ఏనుగు దాని కాలును అతడి తల, ఛాతీపై పెట్టగా ఎముకలు విరిగిపోయాయి.

శరీరం నుజ్జునుజ్జు అయ్యింది.తప్పించుకున్న మిగతా అధికారులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.

ఈ ఘటన పట్ల చాలా విచారం వ్యక్తం చేశారు.

సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు.ఈ దిగ్భ్రాంతికర ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.ఒడిశాకు చెందిన ఏనుగులు గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది జులై నెలలో అడవి ఏనుగు దాడిలో ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డాడు.మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు.ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ ఏనుగుల( Elephants ) దాడులను తగ్గించాలని అటవీ శాఖ తనవంతుగా కృషి చేస్తోంది.అలాగే ఏనుగుల దగ్గరకు వెళ్ళవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube