చరణ్ వద్దనుకుంటేనే ఎన్టీఆర్ కి సైమా అవార్డు వచ్చిందా... తెరపైకి మరో వివాదం?

సాధారణంగా ఒక్కో హీరోకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇలా స్టార్డం ఉన్నటువంటి ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలిసిన నటిస్తే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

 Charan Fans Viral Crazy Rumour On Siima Awards, Ntr Ramcharan,siima Award, Rrr,b-TeluguStop.com

కానీ హీరోల మధ్య వ్యత్యాసాలను చూపెడుతూ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున వివాదాలకు తెరతీస్తుంటారు.ప్రస్తుతం ఇలాంటి వివాదాలను ఎన్టీఆర్( NTR ) రామ్ చరణ్( Ram Charan) ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించారు.ఇందులో మా హీరోకి తక్కువ ప్రాధాన్యత ఉందని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా మా హీరోకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటూ రాంచరణ్ అభిమానులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ntr Fans, Oscar, Ram Charan Fans, Siima Award, Siima-Movie

ఇక ఈ సినిమా ఆస్కార్( Oscar ) నామినేషన్ లో ఉన్నప్పుడు కూడా కాస్త ప్రాధాన్యత రామ్ చరణ్ కె ఇచ్చారు దీంతో ఎన్టీఆర్ను ఇక్కడ కూడా చులకన చేశారని ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇకపోతే తాజాగా ఎన్టీఆర్( Junior NTR ) కి ఈ సినిమాలో కొమరం భీం పాత్రకు గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డు ( Siima Award) వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లి మరి అవార్డు అందుకున్నారు.దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఎన్టీఆర్ ఈ అవార్డును అందుకోవడంతో రామ్ చరణ్ అభిమానులు సరికొత్త రూమర్ క్రియేట్ చేశారు.

Telugu Ntr Fans, Oscar, Ram Charan Fans, Siima Award, Siima-Movie

సైమా వేడుకల నామినేషన్స్ లో భాగంగా రామ్ చరణ్( Ram Charan ) కూడా ఉన్నారు.అయితే రామ్ చరణ్ కి ఈ అవార్డు వచ్చిందని రామ్ చరణ్ వద్దనుకుంటేనే ఈ అవార్డు ఎన్టీఆర్ కు వెళ్ళింది అంటూ రాంచరణ్ అభిమానులు ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.మా హీరో వద్దనడం వల్లే మీ హీరోకి అవార్డు వచ్చిందంటూ ఈ రూమర్ వైరల్ చేయడంతో మండిపడినటువంటి తారక్ ఫ్యాన్స్( Tarak Fans ) చరణ్ అభిమానులపై ట్రోల్స్ చేస్తున్నారు.మా హీరోకి అవార్డు వచ్చిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇలా మరోసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల మధ్య వివాదం జరుగుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube