జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా నువ్వా సీఎం జగన్ గురించి మాట్లాడేదని మండిపడ్డారు.
పనికి మాలిన సన్నాసి అంటూ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్ నీకంటే పిచ్చివాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం జగన్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
పొత్తు కావాలంటే పెట్టుకో అన్న ఆయన సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని తెలిపారు.ఇంకోసారి నోరు అదుపుతప్పి మాట్లాడితే చమడాలు వలిచేస్తామని హెచ్చరించారు.
మానసిక స్థితి బాగాలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణేనని తెలిపారు.







