తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది.ఈ మేరకు నార్లాపూర్ దగ్గర తొలి పంపు మోటార్ స్విచ్ ఆన్ చేశారు సీఎం కేసీఆర్.
ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం కొల్లాపూర్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.కాగా పాలమూరు ప్రజల దశాబ్దాల కల ఇవాళ్టితో సాకారం అవుతుంది.ఈ ప్రాజెక్టుతో సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.మొత్తం 16 నియోజకవర్గాలలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారన్న సంగతి తెలిసిందే.







