సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిన విషయం మనకు తెలిసిందే.ఇలా యూట్యూబ్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం సెలబ్రిటీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నటువంటి అరీయానా( Ariyana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మల్లెతీగ లాంటి సన్నని నడుముతో చూడటానికి ఎంతో నాజూగ్గా ఉన్నటువంటి అరియాన ఒక్కసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

కెరియర్ మొదట్లో యూట్యూబ్ యాంకర్ గా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిందో ఆ క్షణం నుంచి సంచలనగా మారారు.ఇలా ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటూ ఆయన ఈమెపై తాకరాని చోట తాకుతూ ఒక్కసారిగా వీరిద్దరూ చేసినటువంటి బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.దీంతో ఈమెకు కూడా మంచి గుర్తింపు లభించింది.
ఇలా ఒకసారి గా పాపులర్ అయినటువంటి ఈమెకు బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం వచ్చింది.ఈ విధంగా రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అరియాన చూడటానికి చాలా నాజూగ్గా ఉండేది.
అయితే ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఈమె భారీగా శరీర బరువు పెరిగారని తెలుస్తోంది.దీంతో అభిమానులు ఈమెను చూసి షాక్ అవుతున్నారు.
ఇలా అధిక శరీర బరువు పెరిగినప్పటికీ ఈమె మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక డాన్స్ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి ఎంతో మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇక్కడ మనం చూస్తున్నది అరియాననేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కొందరు నెటిజన్స్ ఆంటీలా మారిన అరియానను చూస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా ఎంతోమంది నేటిజన్స్ అరియాన అచ్చం ఆంటీ లాగే ఉంది అంటూ ఈమెపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
మరికొందరైతే మీరు ఇలా ఉన్నఫలంగా శరీర బరువు పెరిగారు అంటే ఏదో సమస్యతో బాధపడుతున్నారు మీ హెల్త్ గురించి ఒకసారి ఆలోచించండి అంటూ కొందరు కామెంట్ చేయడం మరికొందరు మీరు చిన్నగా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపించారు అంటూ ఈమె శరీర బరువు గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.అయితే అరియాన ఉన్నఫలంగా ఇలా శరీర బరువు పెరగడానికి కారణం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేకపోతే ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.







