దేశీ కేంద్ర బ్యాంక్ ఆర్‌బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.అవును, మీరు విన్నది నిజమే.
ఆర్‌బీఐ( RBI ) ఒకేసారి 4 బ్యాంకులకు షాకివ్వడం ఇపుడు హాట్ టోపిక్ గా మారింది.నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించడం గమనార్హం.
తాజాగా ఈ నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు జరిమానా విధించింది ఆర్‌బీఐ.అవి వరుసగా బాచరాజి నాగరిక్ సహకారి బ్యాంక్, బారామతి సహకారి బ్యాంక్, వాగోడియా అర్బన్ కోఆపరేటివ బ్యాంక్, విరాంగం మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్.

ఈ 4 బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా విధించింది.బ్యాంకులు రూల్స్ అతిక్రమించడం వల్లనే ఈ దుస్థితి వాటికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.బారామతి సహకారి బ్యాంక్, ( Baramati Sahakari Bank ) బెచరాజి నాగరిక సహకారి బ్యాంక్( Becharaji Nagarika Sahakari Bank ) వంటి వాటిపై ఆర్‌బీఐ రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించగా వాగోడియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్,( Waghodia Urban Cooperative Bank ) విరాంగం మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్( Viramgam Mercantile Cooperative Bank ) వంటి వాటిపై ఆర్‌బీఐ రూ.5 లక్షల చొప్పున పెనాల్టీ వేయడం కొసమెరుపు.బాచరాజి నాగరిక్ సహకారి బ్యంక్‌పై ఆర్‌బీఐ ప్రధానంగా ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్‌పోజర్ లిమిట్స్ నిబంధనల ఉల్లంఘన కారణంగా పెనాల్టీ వేసినట్లు వెల్లడించింది.

కాగా ఆర్‌బీఐ కోఆపరేటివ్ బ్యాంకులపై( Co-Operative Banks ) ఈమధ్య కాలంలో డేగ కన్ను వేసింది.ఎప్పటికప్పుడు వాటి పనితీరును పరిశీలిస్తూ బ్యాంకులు ఏమైనా పొరపాట్లు చేస్తే.అంటే నిబంధనలను అతిక్రమిస్తే.వాటికి గట్టిగా జరిమనా వేస్తోంది.ఇంకా ఆంక్షలు కూడా తీసుకుస్తోంది.అలాగే కొన్ని సార్లు పలు బ్యాంకులు లైసెన్స్ కూడా రద్దు చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు.
ఇప్పటికే ఆర్‌బీఐ పలు కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.







