పాఠశాల విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం దసరా కానుక..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం( KCR ) తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Kcr Government's Dussehra Gift To School Students , Telangana Governament, Kcr,-TeluguStop.com

విషయంలోకి వెళ్తే ప్రతి పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు.మధ్యాహ్నం భోజనం( Afternoon meal ) పథకం తరహాలో ఉదయం అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో “ముఖ్యమంత్రి అల్పాహార పథకం”( Chief Minister’s Breakfast Scheme ) పేరుతో అల్పాహారం అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది.దసరా రోజు అనగా అక్టోబర్ 24వ తారీకు నుండి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారట.

పాఠశాల పని దినాలలో ఉదయం అల్పాహారం అందించనున్నారు.ఈ పథకం వల్ల ఖజానా పై ₹400 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

ఉదయాన్నే వ్యవసాయ పనులు మరియు కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఇదే పథకం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ ఉంది.అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారుల బృందం పరిశీలించి అనంతరం సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది.

దీంతో మానవీయ కోణంలో ఆలోచించే కేసీఆర్.ప్రభుత్వం విద్యార్థులకు ఉదయాన్నే అల్పాహార భోజన పథకాన్ని అమలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube