ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సన ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా నటి సన( Sana ) కేవలం వెండితెర సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
ఇక ఈమె కుమారుడు అన్వర్ ( Anwar )గురించి అందరికీ సుపరిచితమే ఈయన సీరియల్ నటి సమీరాను వివాహం చేసుకున్నారు.సమీరా కూడా పలుబులు తెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఇక వీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడమే కాకుండా వీరికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అన్వర్ సమీరా దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.తన కుమారుడికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా నటి సమీరా( Sameera sherief ) గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమె వ్యక్తిత్వం గురించి ఓ విషయం బయటపడటంతో చివరికి తన అత్తగారు నటి సనా కూడా షాక్ అయ్యారట.
నా కోడలు వ్యక్తిత్వం ఇలాంటిదా ఇన్ని రోజులు తనలో ఈ విషయాన్ని గుర్తించలేక పోయానా అంటూ ఈమె ఆశ్చర్యపోయారట.
నటి సనా కుమారుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ అన్వర్ కూడా పలు సీరియల్స్( Serials ) చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ పలు సీరియల్స్ నిర్మించారు.ఇలా వీరి నిర్మాణంలో కొన్ని బుల్లితెర సీరియల్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అన్వర్ సమీరా ఆర్థికంగా కూడా ఎంతో మంచి గొప్ప స్థానంలో ఉన్నారు.
దీంతో ఈ దంపతులు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.అన్వర్ సమీరా ఇద్దరూ కూడా కొందరు పేద పిల్లలని దత్తత తీసుకున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ విధంగా పేద పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులకు అయ్యే ఖర్చులన్నింటిని అన్వర్ సమీరా భరిస్తున్నారు.ఇలా వారి చదువుల బాధ్యతలను వీరిద్దరూ తీసుకున్నారన్న విషయం బయటపడటంతో నటి సన ఒక్కసారిగా షాక్ అయ్యారట కొడుకు కోడలు మంచి మనస్తత్వం వారి వ్యక్తిత్వం గురించి ఈమె షాక్ అయ్యారట.తన కొడుకు కోడలు ఇలా పక్కవారి గురించి వారి శ్రేయస్సు గురించి ఆలోచించడం ఎంతో గొప్ప విషయమని ఈ నిర్ణయం పట్ల నటి సన సైతం ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.