ఈ నెల 28వ తేదీన చంద్రముఖి2 సినిమా( Chandramukhi 2 ) థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.భారీ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా చంద్రముఖి మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ సినిమాలో కంగనా రనౌత్ చంద్రముఖి రోల్ లో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాకు కంగనా రనౌత్ కు ఏకంగా 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.
అయితే కంగనా యాక్టింగ్ స్కిల్స్ కు ఈ మొత్తం చాలా ఎక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కంగనాకు ఇచ్చిన పారితోషికంతో మీడియం బడ్జెట్ సినిమా తీయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంగనా రనౌత్( Kangana Ranaut ) సక్సెస్ రేట్ కూడా అంతకంత మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కంగనాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కంగనా సినిమాలు వేర్వేరు వివాదాల్లో సైతం చిక్కుకుంటూ ఉంటాయి.చంద్రముఖి2 సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచలేదు.చంద్రముఖి సినిమా ఒక క్లాసిక్ అని ఆ సినిమాకు సీక్వెల్ తీసి మెప్పించడం కత్తి మీద సాము అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాఘవ లారెన్స్( Raghava lawrence ) ఇలాంటి కాన్సెప్ట్ ను ఎంచుకుని రిస్క్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్కంద( Skanda ), పెదకాపు1 సినిమాలకు పోటీగా చంద్రముఖి2 విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రముఖి2 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.కంగనా రనౌత్ ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే సౌత్ లో మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.