అశ్విని దత్ ఎంత మంది స్టార్ హీరోలను పరిచయం చేశారో తెలుసా ?

అశ్విని దత్( Ashwini Dutt ).తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ సినిమాలు తీయగలిగిన సత్తా ఉన్న నిర్మాత.

 Ashwini Dutt Top 10 Movies , Ashwini Dutt, 10 Movies, Vyjayanthi Movies, Ram Cha-TeluguStop.com

అశ్వినీ దత్ ప్రొడ్యూసర్ గా మారిన మొదటి నుంచి నేటి వరకు భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా తీస్తూనే ఉన్నారు.అన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాల తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి అలాంటి ధైర్యవంతుడైన అశ్విని పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం.

Telugu Ashwini Dutt, Mahesh Babu, Nagarjuna, Ram Charan, Vyjayanthi-Movie

ఈ మధ్యకాలంలో వైజయంతి మూవీస్ ( Vyjayanthi Movies )పేరు చెబితే చాలామంది మహానటి లేదా సీతారామ వంటి సినిమాల పేర్లు చెబుతారు కానీ కాస్త వెరకాలకు వెళితే ఆయన తీసిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి పెళ్ళాం ఊరెళితే, శుభలగ్నం, పెళ్లి సందడి, గంగోత్రి, మహర్షి వంటి సినిమాలు ఆయన కెరియర్ను ఒక స్థాయికి తీసుకెళ్లాయి.ఇక స్టూడెంట్ నెంబర్ వన్ వంటి సినిమాతో రాజమౌళిని( Rajamouli ) సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా కూడా అశ్విని దత్ పరిచయం చేశారు.కేవలం రాజమౌళి మాత్రమే కాదు చిరుత సినిమాతో రామ్ చరణ్ ( Ram Charan )ని కూడా ఆయన సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.చిరంజీవి( Chiranjeevi ) సినిమా అయినా ఇంద్ర చూడాలని ఉంది జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కూడా అశ్విని దత్ కి లాభాల పంట పండించాయి ఎలాంటి సందేహం లేదు.

Telugu Ashwini Dutt, Mahesh Babu, Nagarjuna, Ram Charan, Vyjayanthi-Movie

ఇక నాగార్జునకు( Nagarjuna ) ఆజాద్ వంటి సినిమా తీసిన దత్తు గారు మహేష్ బాబు( Mahesh Babu ) ను హీరో గా పరిచయం చేసిన రాజకుమారుడు సినిమా ను సైతం నిర్మించారు.శ్రీదేవిని ఆఖరిపోరాటం వంటి సినిమా ద్వారా ఒక పవర్ఫుల్ రోడ్ లో నటింపజేసారు.ఇప్పటివరకు మనం చెప్పుకున్న సినిమాలను గమనిస్తే వీటన్నిటిలో ఎక్కువ శాతం దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కినవే కావడం విశేషం రాఘవేంద్రరావు మరియు అశ్విని ఇద్దరు మంచి స్నేహితులు అందువల్లే గొప్ప సినిమాలను తీయగలిగారు.రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసే అవకాశం దొరకడం కూడా అశ్వినిర్మాతకు కలిసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube