వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజలను వేధిస్తున్న వైసీపీ నేతలపై ఎటువంటి కేసులు లేవన్న ఆయన గంజాయి స్మగ్లర్లపైన కేసులు లేవని తెలిపారు.
వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని లోకేశ్ ఆరోపించారు.అంతేకాకుండా ప్రజల తరపున పోరాటం చేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు.పోలీసులు సైతం వైసీపీ నేతలకు మద్ధతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో వైసీపీ విధ్వంస పాలన చేస్తుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.







