2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) సంచలన ప్రకటన చేశారు.తాను అధ్యక్షుడినైతే 75 శాతం ఫెడరల్ (కేంద్ర ప్రభుత్వ) ఉద్యోగులను( Federal Workforce ) తొలగిస్తానని వ్యాఖ్యానించారు.
ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.ఎఫ్‌బీఐ( FBI ) వంటి అనేక సంస్థలను మూసివేస్తానని ప్రకటించారు.
విద్యాశాఖ, ఎఫ్‌బీఐ వంటి వ్యవస్థలే తన లక్ష్యమని వివేక్ వెల్లడించారు.బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమీషన్, కామర్స్ డిపార్ట్‌మెంట్ , పొగాకు, ఐఆర్ఎస్ విభాగాలు లక్ష్యంగా తాను పనిచేస్తానని వివేక్ రామస్వామి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది చివరి నాటికి 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నానని చెప్పారు.వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుతమున్న 22 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల్లో 75 శాతం మందిని తగ్గించడమే తన లక్ష్యమని వివేక్ తెలిపారు.
ఈ పని పూర్తి చేయాలంటే ఎన్నో అపోహలను ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.రొనాల్డ్ రీగన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇదే ఆలోచన చేశారని వివేక్ గుర్తుచేశారు.
ఈ విషయంలో చొరవ తీసుకున్న ట్రంప్‌కే( Donald Trump ) తాను ఈ క్రెడిట్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

అయితే వివేక్ రామస్వామి వ్యాఖ్యలపై అమెరికాలో( America ) విస్తృత చర్చ జరుగుతోంది.ఫెడరల్ ప్రభుత్వంలో 22.5 లక్షల మంది ఉద్యోగులున్నారు.వారిలో 75 శాతం మందిని తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలకాల్సి వస్తుందని నిపుణులుచెబుతున్నారు.ఇది కార్యరూపం దాల్చితే బడ్జెట్‌లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి.
కానీ ఇదే సమయంలో కీలకమైన ప్రభుత్వ కార్యకలాపాలు మూతపడతాయని ఓ అమెరికన్ వార్తా సంస్థ స్పష్టం చేసింది.

ఇకపోతే.తాను అధ్యక్షుడినైతే డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాభిక్ష పెడతానని కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన రామస్వామి మరోసారి బాంబు పేల్చారు.2020 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ హిల్‌లో( US Capitol Hill ) అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడి ప్రస్తుతం న్యాయ విచారణను ఎదుర్కొంటున్న వారికి క్షమాభిక్ష పెడతానని ప్రకటించారు.







