తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీను వైట్ల(Sreenu Vaitla) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఈయన ఇంట్లో విషాదం జరిగింది అంటే ఎవరైనా చనిపోయారు అనుకుంటే పొరపాటే అయితే చనిపోయారు కానీ మనుషులు మాత్రం కాదు.
ఈయన తమ కుటుంబ సభ్యులలో భాగంగా చూసుకుంటున్నటువంటి తమ ఆవు(Cow ) మరణించడంతో శీను వైట్ల సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.తాను మొదటిసారి తెచ్చుకున్నటువంటి ఈ ఆవును తన పిల్లలు లక్ష్మి(Lakshmi ) అనే పేరుతో ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు దాదాపు 13 సంవత్సరాలుగా ఈ ఆవు తన ఫామ్ లోనే ఉందని ఈయన తెలిపారు.

ఇలా లక్ష్మి అని ఎంతో ముద్దుగా పిలుచుకునే ఆవు మరణించడంతో తనతో పాటు తన పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది.ఇక ఈ ఆవును తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూసుకుంటున్నటువంటి తరుణంలో ఈ ఆవుకు సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఆవుకు( Srinu Vaitla Cow ) సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాలామందికి మూగజీవాలు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది.దీంతో తమకు ఇష్టమైనటువంటి వాటిని ఇంట్లో పెంచుకుంటూ వాటిని ఒక జంతువు మాదిరి కాకుండా కుటుంబ సభ్యులు లాగే భావిస్తూ ఉంటారు.ఇలాంటి తరుణంలో అవి మరణిస్తే కనుక ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు.
ఇక శ్రీను వైట్ల కూడా ఆవుని లక్ష్మీగా తన ఇంటి సభ్యులుగా భావించడంతో ఈయన ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఇక శ్రీను వైట్ల సినిమాల విషయానికొస్తే ఈయన ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి ఎంతో మంచి సక్సెస్ సినిమాలను అందుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో శ్రీనువైట్ల స్పీడ్ కాస్త తగ్గిందని చెప్పాలి.
చాలా సంవత్సరాల తర్వాత శ్రీను వైట్ల గోపీచంద్ (Gopi Chand) హీరోగా ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.







