దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanthara ) ప్రస్తుతం కెరియర్ పరంగాను అలాగే వ్యక్తిగత జీవితంలోని ఎంతో సంతోషంగా ఉన్నారు.తాజాగా ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఈమెకు బాలీవుడ్ మొదటి సినిమా కావటం విశేషం.ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో నయనతార ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.

ఇలా జవాన్ సినిమా హిట్ కావడంతో నయనతారకు తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా నయనతార ఇంస్టాగ్రామ్( Nayanthara Instagram ) లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నయనతార తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన భర్త విగ్నేష్( Vignesh ) టీషర్టు ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీగా పెట్టారు.అయితే దీనిపై మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి అని రాసి ఉంది.

ఈ విధంగా నయనతార మంచి రోజులు మొదలయ్యాయి అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నయనతార ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.నయనతార గత ఏడాది తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి( Nayanthara Children ) కావడం అలాగే కెరియర్ పరంగా బిజీ కావడం అన్ని ఆమెకు అనుగుణంగానే జరుగుతున్నాయి.ఇలా అన్ని విషయాలలోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నటువంటి నయనతార మంచి రోజులు తనకు ఇప్పుడే మొదలయ్యాయి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి పోస్ట్ చేశారని భావిస్తున్నారు.
ప్రస్తుతం నయనతార చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







