ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లు, ట్రైన్లు సోషల్ మీడియా( Social Media )లో బాగా వైరల్ అవుతున్నాయి.దీనికి కారణం నేటి యువత సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో రైళ్లలో ప్రాంకులు, స్టంట్స్, ఇంకా సెల్ఫీల వంటి కొన్ని మూర్ఖత్వక పనులు చేయడమేనని చెప్పవచ్చు.
వారు షేర్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.వాటిలో డ్యాన్స్ పర్ఫామెన్స్ వీడియోలు, ఇంకా రిస్కు తక్కువ ఉన్న స్టంట్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.
అలాంటి ఆకట్టుకునే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Videos ) గా మారింది.అందులో ఒక యువతి అద్భుతమైన స్టంట్స్ చేస్తూ చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో రైల్వే స్టేషన్‌లో ఒక అమ్మాయి తన కాళ్లలో ఏదో స్ప్రింగ్‌లు ఉన్నట్లు గాల్లో ఎగురుతూ పల్టీలు కొడుతూ స్టంట్ చేయడం చూడవచ్చు.స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లో నిల్చున్న ప్రయాణికులు అందరూ ఆమెవైపే చూస్తూ ఉండటం గమనించవచ్చు.స్టేషన్ ప్లాట్‌ఫామ్ ఫ్లోర్( Railway Station Platform ) అనేది చాలా గట్టిగా ఉంటుంది.ఏమాత్రం తేడా వచ్చి కిందపడినా ముఖం పచ్చడి అవుతుంది.లేదంటే చేతులు కాళ్లకు బాగా గాయాలు అవుతాయి.అంత రిస్కు ఉన్నా ఈ యువతి చాలా కాన్ఫిడెన్స్ తో గాల్లో పల్టీలు కొట్టి, యాక్షన్ స్టంట్స్( Girl Stunts ) చేసి వావ్ అనిపించింది.
అందుకే సమీపంలో ఉన్న ఒక అబ్బాయి చప్పట్లు కొట్టి ఆమె సాహసాన్ని మెచ్చుకున్నాడు.

ఇటీవల @ar_banjara_status అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్, లైకులు పొందింది.దీనిని కొత్తగా చాలామంది చూస్తూ ఉన్నారు.లైక్స్ చేస్తూ ఉన్నారు.
దాంతో అది ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన చాలామంది యువతిని పొగుడుతున్నారు.
దీనికి చాలా సాధన కావాలని అంటున్నారు.అలాగే ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.







