హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సినీ ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు బాలాజీ, మురళీకి కస్టడీ విధించారు.
కాగా ఇందులో సినీ ఫైనాన్షియర్ వెంకట్ మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.విచారణలో భాగంగా సుమారు 18 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెంకట్ ఒప్పుకున్నారు.
అయితే తమ పేర్లు బయటికి రావడంతో వెంకట్ కస్టమర్లు అందరూ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.కస్టమర్లతో స్నాప్ చాట్ లో మాత్రమే చాట్ చేసినట్లు వెంకట్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే వెంకట్ అరెస్ట్ అయిన తరువాత కస్టమర్లు స్నాప్ చాట్ అకౌంట్ లను డిలీట్ చేశారని పోలీసులు వెల్లడించారు.







