మాస్ మహారాజ్ రవితేజ( Ravi Teja )ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.సాధారణంగా స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని తెలివిగా వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే రవితేజ మాత్రం తను సంపాదించిన డబ్బుతో చిన్న సినిమాలను నిర్మిస్తూ ప్రశంసలతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
రవితేజ నిర్మాణంలో ఛాంగురే బంగారు రాజా సినిమా( Changure Bangaru Raja Movie ) తెరకెక్కగా ఈ వారం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాలో కార్తీక్ రత్నం హీరోగా నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తీక్ రత్నం ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వినాయక చవితి పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని కార్తీక్ రత్నం( Karthik Ratnam ) తెలిపారు.
సినిమాలో కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
బంగార్రాజు అనే మెకానిక్ రోల్ లో ఈ సినిమాలో కనిపిస్తానని ఈ సినిమాలో నవ్వించే రోల్ లో కనిపించానని కార్తీక్ రత్నం అన్నారు.
మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాకు నిర్మాత అని తెలిసిన తర్వాత చాలా సంతోషించానని కార్తీక్ రత్నం( Karthik Ratnam ) అన్నారు.సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు రవితేజ, నాని స్పూర్తి అని కార్తీక్ రత్నం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
కేరాఫ్ కంచరపాలెం రిలీజ్ సమయంలో రవితేజ( Ravi Teja )ను దగ్గరినుంచి చూడాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక ఫోటో తీసుకున్నానని ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే సినిమా చేశానని కార్తీక్ రత్నం తెలిపారు.ఇది కదా నిజమైన గెలుపు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.మాస్ మహారాజ్ రవితేజకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.