స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు అయింది.ఈ మేరకు హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
కుంభకోణం కేసుకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు.కాగా ఈ క్యాష్ పిటిషన్ ను మరికాసేపటిలో హైకోర్టు విచారించనుంది.
ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారని తెలుస్తోంది.చంద్రబాబు ఎటువంటి స్కాం చేయలేదంటున్న న్యాయవాదులు ప్రభుత్వమే కక్ష పూరితంగా ఇరికించిందని చెబుతున్నారు.
దీనిపై అటు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినపించనున్నారు.







