స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టివేయాలని హైకోర్టు క్యాష్ పిటిషన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు అయింది.

ఈ మేరకు హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.కుంభకోణం కేసుకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా ఈ క్యాష్ పిటిషన్ ను మరికాసేపటిలో హైకోర్టు విచారించనుంది.ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు ఎటువంటి స్కాం చేయలేదంటున్న న్యాయవాదులు ప్రభుత్వమే కక్ష పూరితంగా ఇరికించిందని చెబుతున్నారు.

దీనిపై అటు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినపించనున్నారు.

Wettbörsen Guide Für Deutsche Mobile-Player: Rubbellose Online Vernünftig Nutzen In Deutschland