టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా జూనియర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం అనే విషయం అందరికి తెలిసిందే.
ఒక రకంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కు కార్ల పిచ్చి చాలానే ఉంది.అందుకే ఎన్టీఆర్ మార్కెట్లో కొత్త కారు వచ్చినా కూడా దానిని కోట్లు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు కొంటాడు.
ఇప్పటికే ఎన్టీఆర్ కు 20 కార్లు పైనే( NTR Cars ) ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఆ కార్లలో ఒక్కో కారు ధర కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.
అదేవిధంగా ఎన్టీఆర్ కార్లను అన్నింటిని ఒకసారి గమనిస్తే కార్లకు 9999 ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది.

ఈ ఫ్యాన్సీ నెంబర్( Junior NTR Fancy Number ) కోసం ఎన్టీఆర్ ప్రతిసారి కూడా లక్షలు ఖర్చు చేస్తున్నారు.మరి ఆ ఫ్యాన్సీ నెంబర్ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కార్ల పిచ్చి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మొన్నటికి మొన్న 5 కోట్లకు పైగా ఖర్చు చేసి లంభోర్ఘిని బ్రాండ్ కారు ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నాడు.
తారక్ దగ్గర కార్స్ కలెక్షన్ బాగానే ఉంది.అన్నింటికి ఒకే నెంబర్ ఎందుకు ఉంది అనేది మాత్రం చాలా మందికి అర్థం కాని విషయం.దీని వెనక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది.పైగా సినిమా ఇండస్ట్రీలో అన్నింటి కంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్.
ఏదైనా కలిసొచ్చిందంటే దాన్ని వదలడానికి మనసు రాదు.ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999 ఉంటుంది.

ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే.దాంతో జూనియర్ ఎన్టీఆర్‌కు 9999 అనేది సెంటిమెంట్( Junior NTR 9999 Sentiment ) అంటూ ప్రచారం జరిగింది.తన ప్రతీ కారుకు 9999 ఉండటంపై యంగ్ టైగర్ కూడా స్పందించాడు.అయితే అంతా అనుకుంటున్నట్లు తనకు కార్ నెంబర్ విషయంలో ఎలాంటి సెంటిమెంట్స్ లేవని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
కాకపోతే తన కార్లకు 9999 నెంబర్ ఉండటం వెనక ఒక కారణం.కథ ఉన్నాయని అన్నాడు.తనకు 9 అనే అంకె ఇష్టమని చెప్పాడు తారక్.తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్ 9999 అని ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట( Harikrishna ) కూడా అదే వాడాడని అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ తెలిపారు.
అందుకే మరో ఆలోచన లేకుండా తన కార్లకు అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.







