ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోవు ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సిరిసిల్ల ఇంచార్జి డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఏసి ఫంక్షనల్ హాల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని అన్ని పార్టీల సభ్యులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.

 Everyone Should Follow The Election Rules Sircilla Incharge Dsp Nagendrachari,-TeluguStop.com

అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ.రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియెగించుకునేల ప్రతి ఒక్కరు సహకరించాలని, రాబోవు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల సభ్యులు, కార్యకర్తలు సహకరించాలని అన్నారు.

ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ యెక్క సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు.

ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అని సోషల్ మీడియా మీద పోలీస్ శాఖ నిఘా ఉంటుంది అని,సోషల్ మీడియా లో వచ్చే మెసేజ్ లు నిజ నిజాలు తెల్వకుండా పోస్ట్ చేయరాదని అలా చేస్తే పోస్ట్ చేసే వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,ఇతర శాఖల సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించలన్నారు.

డీఎస్పీ వెంట సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube