ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోవు ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సిరిసిల్ల ఇంచార్జి డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఏసి ఫంక్షనల్ హాల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని అన్ని పార్టీల సభ్యులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.
అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ.రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియెగించుకునేల ప్రతి ఒక్కరు సహకరించాలని, రాబోవు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల సభ్యులు, కార్యకర్తలు సహకరించాలని అన్నారు.
ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ యెక్క సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు.ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అని సోషల్ మీడియా మీద పోలీస్ శాఖ నిఘా ఉంటుంది అని,సోషల్ మీడియా లో వచ్చే మెసేజ్ లు నిజ నిజాలు తెల్వకుండా పోస్ట్ చేయరాదని అలా చేస్తే పోస్ట్ చేసే వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.
ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,ఇతర శాఖల సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించలన్నారు.
డీఎస్పీ వెంట సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఉన్నారు.
ఆ స్టార్ హీరోతో డేటింగ్ గురించి త్రిష క్లారిటీ ఇదే.. వాళ్ల నోర్లు మూయించిందిగా!