పెద్దన్న పాత్ర పోషిస్తున్న పవన్!

ఇంతకాలం పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడిగా విమర్శలు ఎదుర్కున్న జనసెన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Janasena Pawan kalyan ) గత కొద్ది కాలంగా అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తదనంతర తెలుగుదేశం శ్రేణుల నైరాశ్యం మధ్య తానున్నానంటూ ముందుకు వచ్చిన పవన్ రెండు పార్టీలకు ఉమ్మడి నాయకుడిగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన తీరు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఆనందం తో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది .

 Janasena Pawan Kalyan Supports Tdp Chandrababu Naidu,janasena Pawan Kalyan, Tdp-TeluguStop.com
Telugu Ap, Chandrababu, Janasenapawan, Lokesh, Tdp Chandrababu, Ys Jagan-Telugu

తెలుగుదేశం అనుకూల మీడియా( TDP Media ) అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేసింది.అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించారని మిత్రుడికి కష్టకాలంలో తోడుగా నిలబడటం అంటే ఏమిటో నిరూపించారని ఒక ప్రముఖ మీడియా ఛానల్ న్యూస్ ప్రజెంటర్ హ్యాట్సాఫ్ చెప్పారు.ఇది చాలామంది కార్యకర్తల మనోభావాలను అద్దం పఅట్టిన చర్యగా చూడవచ్చు.తమ పార్టీ ఎదగడానికి ఒక అవకాశం గా దీనిని మలుచుకోకుండా సాటి మిత్రపక్షం నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పెద్దన్న లా వ్యవహరించిన పవన్ తీరు రాజకీయాల్లో తానెంత విలక్షణ నాయకుడో పవన్ నిరూపించినట్టు అయ్యింది .

Telugu Ap, Chandrababu, Janasenapawan, Lokesh, Tdp Chandrababu, Ys Jagan-Telugu

తన వెనుక తన అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి మరియు చంద్రబాబు కుమారుడు లోకేష్( Nara Lokesh ) స్వయంగా చెప్పుకొచ్చాడు అంటే పవన్ ఏ స్థాయిలో తెలుగు దేశానికి ఆపద్బాంధవుడులా నిలిచాడన్నది చెప్పుకోవచ్చు.అంతేకాకుండా తన ఈ చర్య ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరితే ఓటు ట్రాన్స్ఫర్ జనసేన అభ్యర్థులకు ఈజీగా మారేలా మార్గం సుగమం చేసినట్లయ్యింది రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాప్రయోజనాలు అవ్వాలి తప్ప అందులో తక్షణ రాజకీయ ప్రయోజనాలను వెతుక్కొ కూడదని నిన్ను పడగొట్టి నేను నిలబడతానన్న కుటిల రాజకీయ నీతికి భిన్నంగా నిన్ను నిలబెట్టి నీతో కలిసి నడుస్తానన్న స్నేహదర్మాన్ని పాటించిన పవన్ ఆదర్శ రాజకీయ నాయకుడిగా మిగిలాడని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube