సోషల్ మీడియా ప్రపంచంలో నేటి యువత మునిగి తేలుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.ఇక క్రియేటర్లు అనబడేవారు రీల్స్( Reels ) చేయడం కోసం ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు.
అయితే ఈ క్రమంలో కొంతమంది ఔత్సాహికులు కోరి ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు.సినిమాల మాదిరిగా స్టంట్స్( Stunts ) చేయడం మొదలు పెడుతున్నారు మరికొందరు.
కానీ రీల్, రియల్ లైఫ్ పూర్తిగా భిన్నమైనవని నేటి యువత ముఖ్యంగా అర్థం చేసుకోవాలి.ప్రస్తుతం అలాంటి ఓ విచిత్ర ప్రవర్తనకు సంబందించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు తన ప్రియురాలిని( Girlfriend ) ఆకట్టుకోవడానికి బైక్‌పై( Bike ) ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మనకు కనిపిస్తోంది.అయితే విధి చాలా విచిత్రమైనది కదా.మనోడు ఒకటనుకుంటే దైవం ఇంకొకటి తలిచాడు.అమ్మాయిని ఇంప్రెస్ చేయబోయి పాపం ఆ అమ్మాయికే గాయం చేశాడు.
ఇంకేముంది కట్ చేస్తే ఆ ప్రియురాలు ఆస్పత్రి పాలయ్యింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి హెల్మెట్ ధరించి నిర్మానుష్య రహదారిపై నిలబడి వుండడం మనం చూడవచ్చు.ఇంతలో ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు.కానీ ఈ తరుణంలోనే బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ఆ అమ్మాయిని గట్టిగా గుద్దింది.
దీంతో ఆ అమ్మాయి కిందపడిపోయింది.దాంతో అక్కడ వున్నవారి ముందు వారిద్దరూ నవ్వుల పాలయ్యారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.కాగా దీనిని లక్షల్లో వీక్షించారు.
ప్రస్తుతానికి ఈ క్లిప్ ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడింది అనేది ధృవీకరించబడలేదు.అయితే ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో మాత్రం నవ్వుల పువ్వులు పూయిస్తోంది.







