ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు (AI) ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందుతోంది.ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ పుణ్యమా అని ఈ టెక్నాలజీ ఒక్కసారిగా ఊపందుకుంది.
గత కొద్ది నెలలుగా ఈ టెక్నాలజీ ఆధారంగా ఎన్నో టూల్స్ అందుబాటులోకి వస్తూ ప్రజలకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నాయి.వీటి వల్ల నష్టాలు ఉన్నాయి, కానీ అవి అందించే ప్రయోజనాలను విస్మరించలేం.

తాజాగా అలెక్స్ అనే నాలుగేళ్ల బాలుడి మిస్టీరియస్ వ్యాధి( Mysterious Disease )కి చాట్‌జీపీటీ పరిష్కారం చూపింది.ఈ బాలుడు మూడు సంవత్సరాలుగా విపరీతమైన నొప్పితో, అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.బాలుడి బాధ చూడలేక అతని తల్లి కోర్ట్నీ 17 మంది వైద్యులను సంప్రదించింది, కానీ వారిలో ఎవరూ అతని అనారోగ్యానికి గల కారణాన్ని గుర్తించలేకపోయింది.వైద్యులతో విసుగు చెందిన కోర్ట్నీ సమాధానాలు వెతకాలనే పట్టుదలతో చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని ఆశ్రయించింది.
కోర్ట్నీ తన కుమారుడు అలెక్స్‌కి నిరంతర పంటి నొప్పులు, తగ్గిపోయిన ఎదుగుదల వంటి సింప్టమ్స్ ఉన్నాయని చాట్‌జీపీటీకి వివరించింది.చాట్‌జీపీటీ( ChatGPT ) ఆ లక్షణాలన్నీ ఏ జబ్బు ఉంటే వస్తాయో చెప్పేందుకు తన డేటాబేస్ బాగా చెక్ చేసింది.
అనంతరం అది ఆ బాలుడు టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్( Tether Cord Syndrome ) అనే అరుదైన నాడీ సంబంధిత కండిషన్‌తో బాధపడుతూ ఉండొచ్చని సూచించింది.ఈ రోగ నిర్ధారణ కోర్ట్నీ ఉత్సుకతను రేకెత్తించింది.
ఆమె ఆ కండిషన్ గురించి మరిన్ని వివరాలను పరిశోధించడం ప్రారంభించింది.టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ ఉన్న పిల్లల తల్లిదండ్రుల సపోర్ట్ గ్రూప్‌లో కూడా చేరింది.

ఆ కండిషన్ గురించి వీలైనంత వివరాలను సేకరించాక కోర్ట్నీ అలెక్స్‌ను వైద్యుల వద్దకు మళ్లీ తీసుకెళ్లి పరీక్ష చేయాలని కోరింది.అది టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ కాదని వైద్యులు మొదట్లో తోసిపుచ్చారు, కానీ వారు చివరికి MRI స్కాన్ చేయడానికి అంగీకరించారు.ఎమ్ఆర్ఐ ఫలితాలు చాట్‌జీపీటీ చెప్పిన వ్యాధే పిల్లోడికి ఉందని నిర్ధారించాయి.చివరకు అలెక్స్ జబ్బు ఏంటో తెలియడంతో కోర్ట్నీ ఊపిరి పీల్చుకుంది.టెథర్డ్ కార్డ్ సరిచేయడానికి ఆమె అతన్ని న్యూరోసర్జన్ వద్దకు తీసుకువెళ్లింది.అలెక్స్‌కు న్యూరో సర్జన్ ఒక సర్జరీ చేశారు.
కొన్ని వారాల్లోనే బాలుడిలో మెరుగుదల సంకేతాలను కనిపించాయి.అతని నొప్పి తగ్గింది, పెరుగుదల రేటు పెరిగింది.
వైద్య నిర్ధారణ, చికిత్సలో AI ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందో అలెక్స్ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.AI పెద్ద మొత్తంలో వైద్య డేటాను యాక్సెస్ చేయగలదు, డాక్టర్స్ మిస్ అయ్యే మోడల్స్ గుర్తించగలదు.







