ప్రభాస్‌, మారుతి మూవీ... మళ్లీ అదే ముచ్చట

పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్( Superstar Prabhas ) మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం లో రూపొందిన సలార్‌.

 Prabhas And Maruthi Film Shooting Start Again , Superstar Prabhas, Flim News, Ma-TeluguStop.com

భారీ బడ్జెట్‌ తో ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్న అంచనాలతో రాబోతున్న సలార్‌ 1 ( Salar 1 )సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న సమయంలో వాయిదా వేయడం జరిగింది.ఈ నెలలో రావాల్సిన సలార్‌ ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు.

ప్రమోషన్ కోసం సినిమా ను ఆలస్యం చేస్తున్నారు అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం మారుతి ( Maruti )దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

దాదాపు ఏడాది క్రితం ప్రారంభం అయిన ఆ సినిమా షూటింగ్‌ ను ప్రభాస్ కు ఖాళీ ఉన్న సమయం లో షూట్‌ చేస్తున్నారు.అలా చేయడం వల్ల షూటింగ్‌ చాలా స్లో గా సాగుతోంది.సలార్ సినిమా విడుదల వాయిదా పడ్డ కారణంగా ఇప్పుడు సమయం లభించింది.దాంతో ప్రభాస్ మరియు మారుతి కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.అయితే ఈసారి కూడా ఈ కాంబో సినిమా కు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు.అసలు సినిమా ఉందా లేదా అన్నట్లుగానే అంతా సైలెంట్ గా కొనసాగుతున్నారు.

ముందు ముందు అయినా ఈ సినిమా కు సంబంధించిన ప్రకటన వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు.

ప్రభాస్ కు తగ్గట్లుగా ఒక మంచి హర్రర్‌ కామెడీ కథ ను మారుతి రెడీ చేశాడు.రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ ను అనుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube