2019లో కెనడాలోని( Canada ) బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో మాదక ద్రవ్యాలకు( Drugs ) సంబందించి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు ఇండో కెనడియన్ సిక్కులకు( Indo Canadian Sikhs ) న్యాయస్థానం శిక్ష విధించింది.సర్రే నగరంలోని వాల్లీ వద్ద వున్న బేస్మెంట్ అపార్ట్మెంట్లో స్నేహితుడితో కలిసి సినిమా చూస్తుండగా 30 ఏళ్ల ఆండ్రూ బాల్డ్విన్( Andrew Baldwin ) నవంబర్ 11, 2019న దారుణ హత్యకు గురయ్యాడు.
నిందితులను జగ్పాల్ సింగ్ హోతీ,( Jagpal Singh Hothi ) జస్మాన్ సింగ్ బస్రాన్లుగా( Jasman Singh Basran ) గుర్తించినట్లు ది వాంకోవర్ సన్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది.జగ్పాల్పై ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగాలు మోపగా.
సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించినందుకు అతని సహచరుడు జస్మాన్ సింగ్‌పై అనుబంధంగా అభియోగాలు మోపారు.
న్యూ వెస్ట్‌మినిస్టర్‌లోని బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్ట్ గతవారం హోతీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.న్యాయ విచారణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన జస్మాన్కు 18 నెలల జైలు శిక్ష విధించింది.మరోవైపు.
ఈ ఏడాది ప్రారంభంలో జోర్డాన్ బాటమ్లీ( Jordan Bottomley ) కూడా ఈ కేసులో నేరాన్ని అంగీకరించాడు.దీంతో న్యాయమూర్తి అతని శిక్షను ఎనిమిది నుంచి మూడు సంవత్సరాల 38 రోజులకు తగ్గించారు.
బాల్డ్విన్ను బాటమ్లీ ఆరుసార్లు కొత్తితో పొడిచినట్లు ది సన్ నివేదించింది.ఈ హత్యలో పాల్గొన్న నాల్గవ వ్యక్తి మున్రూప్ హేయర్ ఇంకా న్యాయ విచారణను ఎదుర్కోవాల్సి వుంది.
అయితే బాటమ్లీ, హోతీ, బాల్డ్విన్లు స్థానిక మాదకద్రవ్యాల వ్యాపారంలో నాల్గవ వ్యక్తి కోసం పనిచేశారని జస్టిస్ మార్తా ఎమ్ డెవ్లిన్( Justice Martha M Devlin ) తన తీర్పులలో రాశారు.ఓ రోజున బస్రాన్ను ఓ చోటికి వెళ్లాలని హోతీ పిలిపించాడు.హత్య జరిగిన రోజు రాత్రి బాటమ్లీ లేయర్డ్ దుస్తులు, గ్లౌజులు ధరించి కత్తి, బేర్ స్ప్రేతో సూట్లోకి ప్రవేశించి బాల్డ్‌విన్‌పై దాడి చేసినట్లు డెవ్లిన్ రాశారు.రక్తం నిండిన దుస్తులతో బాటమ్లీ .ట్రక్కు వద్దకు వచ్చాడని.కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత బాటమ్లీని బయటకు పంపాల్సిందిగా బస్రాన్ కోరాడు.
ఆపై హోతీ, బస్రాన్లు రక్తపు మరకలు తుడిచివేశారు.అనంతరం వాల్‌మార్ట్ నుంచి క్లీనింగ్ సామాగ్రిని కొనుగోలు చేశారు.
ఈ సమయంలో ట్రక్కు వెనుక భాగంలో బాటమ్లీ వదిలిన కత్తిని ఇద్దరూ చూశారు.