సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోవడం లేదా వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతుంది.ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు ప్రేమలో పడి సహజీవనం చేసే అనంతరం బ్రేకప్ చెప్పుకున్న వారు ఉన్నారు.
అయితే వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి విడాకులు తీసుకున్నటువంటి వారు ఉన్నారు.ఇలా ఒకరితో ప్రేమలో పడి సహజీవనం చేసి మరొకరిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం సంతోషంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
మరి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ పెళ్లయిన హీరోలతో ప్రేమలో పడి సహజీవనం చేసే బ్రేకప్ చెప్పకున్నటువంటి హీరోయిన్స్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.నటి చార్మి ( Charmi ) పిల్లలు ఉన్నటువంటి డైరెక్టర్ కృష్ణ వంశీ ( Krishnavamshi ) అలాగే పూరి జగన్నాథ్ ప్రేమలో పడింది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ కారణంగానే కృష్ణవంశీ రమ్యకృష్ణ మధ్య గొడవలు వచ్చాయంటూ తెలిసింది.కృష్ణవంశీతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఈమె పూరి జగన్నాథ్( Puri Jagannath ) తో రిలేషన్ లో ఉన్నారని అయితే ఇప్పటికీ వీరిద్దరు నిర్మాణ సంస్థను ప్రారంభించి ముంబైలోనే ఎక్కువగా ఉండడంతో వీరి గురించి ఇప్పటికి ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

ఇక ఆపిల్ బ్యూటీ హన్సిక( Hansika ) సైతం కోలీవుడ్ హీరో ఉదయనిది స్టాలిన్ ( Udayanidhi Stalin ) ప్రేమలో పడింది అని తెలుస్తుంది.అయితే అప్పటికే ఈయనకు పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు ఇలా పెళ్లయిన హీరోతో ఈమె రిలేషన్ లో ఉంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది.అయితే ప్రస్తుతం హన్సిక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకనటి నయనతార ( Nayanatara ) ప్రస్తుతం విగ్నేష్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె గతంలో డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా( Prabhudeva )తో ప్రేమలో పడటం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం కూడా జరిగింది.
అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు.

ఇకపోతే సీనియర్ నటి అనుష్క( Anushka ) సైతం సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు అయితే నాగార్జున అనుష్క కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమె నాగార్జునతో రిలేషన్ లో ఉంది అంటూ ఈమె గురించి కూడా వార్తలు వచ్చాయి.ఇకపోతే నటి శృతిహాసన్ ( Shruthi Hassan ) సైతం హీరో ధనుష్ ( Danush ) తో ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.వీరిద్దరూ కలిసి త్రీ సినిమాలో నటించారు ఈ సినిమాలో వీరి పెర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా సరే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ సందేహాలు వ్యక్తం చేయక మానదు.
ఇక గత కొద్ది రోజుల క్రితం వరకు కీర్తి సురేష్( Keerthy Suresh ) నటుడు విజయ్ ( Vijay )తో ప్రేమలో ఉందని త్వరలోనే ఈయన తన భార్యకు విడాకులు ఇచ్చి కీర్తి సురేష్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వీరిద్దరి గురించి కూడా ఎన్నో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.







