సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.ఈయన ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.
కానీ ఇప్పుడు అలా కాదు.కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.
ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను తన యూనివర్స్ లో భాగం చేస్తూ వస్తున్నాడు.
అయితే లోకేష్ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే.ఎప్పటి నుండో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒక సినిమా చేయనున్నాడు అంటూ రూమర్స్ రాగా నిన్నటితో ఈ రూమర్స్ కు తెరపడింది.సూపర్ స్టార్ తలైవర్ 171 వ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని నిన్న అఫిషియల్ గా ప్రకటన వచ్చింది.
అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) మ్యూజిక్ అందించనున్నట్టు తెలిపారు.ఇక సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.అలాగే ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్లు గా అన్బు అరివ్ వ్యవహరించనున్నారని తెలిపారు.ప్రకటనతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని దీనికి సంబంధం లేకుండా ఈ సినిమా మాస్టర్ సినిమా తరహాలో సెపరేట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
చూడాలి మరి రజనీకాంత్ తో లోకేష్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.