Jigarthanda Doublex : లారెన్స్ సినిమా టీజర్ విడుదల చేసి విషెస్ చెప్పిన మహేష్.. ట్వీట్ వైరల్?

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraj ) 2014లో తెరకెక్కించిన సినిమా జిగర్తండ.ఈ సినిమా అప్పట్లో విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ సింహా నటనకు గాను ఉత్తమ సహాయం చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు.ఈ సినిమాను హీరో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ పేరుతో రిమేక్ చేసిన విషయం తెలిసిందే.హిందీలో బచ్చన్ పాండే గా ఈ సినిమా రీమేక్ అయ్యింది.

 Raghava Lawrence Sj Suryah Jigarthanda Doublex Teaser Launched By Mahesh Babu-TeluguStop.com

ఇది ఇలా ఉంటే జిగర్ తండ డబుల్ ఎక్స్( Jigarthanda doublex teaser ) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీక్ సుబ్బరాజు.గతంలో విడుదలైన జిగర్తండ మాదిరి కాన్సెప్ట్‌తోనే వింటేజ్ యాక్షన్ డ్రామాను చూపించబోతున్నారు.కాగా ఈ మూవీలో రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్‌ను అన్ని భాషల వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలతో పూర్తిస్థాయి యాక్షన్‌తో రూపొందించారు.పాత్రలను పరిచయం చేయడం, సినిమా కాన్సెప్ట్‌ను చెప్పడమే ఈ టీజర్ ముఖ్యోద్దేశంలా కనిపిస్తోంది.

ఈ పాన్ ఇండియా టీజర్‌ను తెలుగులో మహేష్ బాబు( Mahesh babu ) విడుదల చేయగా, తమిళంలో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.అన్ని భాషల్లో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.ఈ సినిమా దీపావళి పండుగ విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

అంతేకాకుండా మూవీ మేకర్స్ కు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube