తలనొప్పి( Headache ).ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.
పని ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, అధిక రక్తపోటు, సైనస్ తదితర కారణాల వల్ల తల నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.పావుగంట లేదా అరగంట తలనొప్పి వస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
కానీ కొందరికి నాన్ స్టాప్ గా తల నొప్పి వస్తూనే ఉంటుంది.ఈ తలనొప్పి వల్ల పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.
చాలా చిరాకుగా ఉంటుంది.అందులోనూ మైగ్రేన్( Migraine ) అయితే మరింత ఇబ్బందిగా ఉంటుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ కనుక పాటిస్తే మందులు కూడా వాడక్కర్లేదు క్షణాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార( Sugar ) వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ఈ డ్రింక్ తలనొప్పికి న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.ఈ డ్రింక్ ను తాగితే తలనొప్పి క్షణాల్లో దూరం అవుతుంది.
అలాగే రెండు ఉసిరికాయలు( Amla ) తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ ను నుదుటిపై అప్లై చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేసినా కూడా తలనొప్పి దెబ్బకు ఎగిరిపోతుంది.
బాడీ డీహైడ్రేట్( Body Dehydrate ) అయినా నాన్ స్టాప్ గా తలనొప్పి వస్తుంటుంది.కాబట్టి వాటర్ తో పాటు కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకోండి.
తద్వారా తలనొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు.తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతుంటే ల్యాప్ టాప్, ఫోన్ వినియోగించడం కాసేపు ఆపండి.
రెస్ట్ తీసుకోండి లేదా ఫ్రెష్ ఎయిర్ లో వాకింగ్ చేయండి.తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక గసగసాలు( Poppy Seeds ) కూడా తలనొప్పి నుంచి బయటపడడానికి సహాయపడతాయి.వన్ టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకుని వాటర్ తో కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ను నుదుటిపై అప్లై చేసి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా చేసినా కూడా తలనొప్పి ఎగిరిపోతుంది.