టాలీవుడ్‌ నుండి త్రిష కు పిలుపు వచ్చినట్లే వచ్చి మిస్‌..!

పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ లు ఎవరు అనే జాబితా తీస్తే అందులో ముందు ఉండే పేర్లలో త్రిష( Trisha Krishnan ) పేరు కచ్చితంగా ఉంటుంది.టాలీవుడ్‌, కోలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ త్రిష.

 Heroine Trisha Again Get Chance For Tollywood Movie , Trisha Krishnan , Tolly-TeluguStop.com

ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమా లు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్‌ చేసి ఉండదు అనడం లో సందేహం లేదు.ఇక టాలీవుడ్‌ లో దాదాపు అందరు స్టార్‌ హీరోలు, సూపర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలను చేస్తూ దూసుకు పోయింది.

ఈ మధ్య కాలంలో తెలుగు కు కాస్త దూరంగా ఉంది.

Telugu Bodyguard, Bollywood, Chiranjeevi, Kollywood, Telugu, Tollywood, Top, Tri

త్రిష కావాలని దూరంగా ఉందా లేదంటే సీనియర్‌ అయింది కదా అని త్రిషను తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో త్రిష( Trisha Krishnan ) కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమా లను కూడా ఆమె చేస్తూనే ఉంటుంది.

తాజాగా త్రిష కు సంబంధించిన వార్త ఒకటి తెలుగు ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తోంది.చాలా కాలం తర్వాత త్రిష ఒక తెలుగు సినిమా కమిట్ అయింది.ఆమె అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు తెర పడ్డట్లు అయింది. ఆకట్టుకునే అందం ఈమె సొంతం అంటూ ఎంతో మంది ఇప్పటికి కూడా అంటూనే ఉంటారు.


Telugu Bodyguard, Bollywood, Chiranjeevi, Kollywood, Telugu, Tollywood, Top, Tri

నాలుగు పదుల వయసు లో ఈ రేంజ్ లో అందాల విందు చేయడం ఎవరికి సాధ్యం కాదు.కానీ త్రిష మాత్రం పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా అందాల విందు చేస్తూ ఉంటుంది.అందుకే చాలా మంది త్రిష ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.త్రిష తెలుగు లో ఆ మధ్య చిరంజీవి( Chiranjeevi ) సినిమా లో ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి.

బ్రో డాడీ ( Bro daddy )రీమేక్ లో చిరంజీవికి జోడీగా త్రిష నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.కానీ ఆ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టేశారు.

అందుకే ఈ సినిమా లో ఆమె లేదని.తెలుగు సినిమా ల్లో ఆమె నటించడం లేదని తేలిపోయింది.

కానీ ఒక సీనియర్ స్టార్‌ కి జోడీగా మళ్లీ ఈమెకు ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.మరింత క్లారిటీ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube