బొంబాయి, రోజా వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. కొన్నాళ్లు సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన ఒరువన్ సినిమాతో తిరిగి కంబ్యాక్ ఇచ్చాడు.
రీసెంట్ టైమ్స్‌లో ధృవ, తలైవి, కస్టడీ వంటి సినిమాల్లో కూడా నటించాడు.అరవింద్ స్వామి విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.
సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తన వ్యాపారాన్ని విస్తరించాడు.అతని తండ్రి వెంకటరామ దొరై స్వామి సుప్రసిద్ధ తమిళ వ్యాపారవేత్త అని బయట ప్రపంచానికి అందరికీ తెలుసు అయితే అది అబద్ధమని తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు చెప్పి షాక్ ఇచ్చాడు.
అరవింద్ స్వామి తన బయోలాజికల్ సన్ అని ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ కుమార్ ( Delhi kumar )ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.అయినప్పటికీ, తమ మధ్య తండ్రీ-కొడుకుల సంబంధం లేదని, ఎందుకంటే అరవింద్‌ని చిన్నతనంలోనే తన చెల్లెలు వసంత స్వామికి దత్తత ఇచ్చానని సదరు యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
అరవింద్ వసంత కొడుకుగా పెరిగాడు.ఢిల్లీ కుమార్‌తో పెద్దగా పరిచయం పెంచుకోలేదు.భవిష్యత్తులో అరవింద్‌తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇంతకు ముందు ఎప్పుడూ కలిసి నటించలేదని ఢిల్లీ కుమార్ అన్నారు.అరవింద్ తన దత్తత గురించి ఇంతకు ముందెన్నడూ మాట్లాడని కారణంగా ఈ నిజం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఇకపోతే అరవింద్ స్వామి 1990లలో( Aravind swamy ) ప్రముఖ రొమాంటిక్ హీరో.అతను చాలా అందంగా కనిపించేవాడు అందువల్ల చాలా మంది యువతులు అతన్ని వివాహం చేసుకోవాలని కోరుకున్నారు.అతను తన తొలి చిత్రం దళపతిలో చేసాడు, అక్కడ అతను చిన్న పాత్రలో నటించాడు.అయితే అతని నటన ఎంతగానో ఆకట్టుకోవడంతో రోజా సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.అరవింద్ స్వామి అనేక ఇతర విజయవంతమైన చిత్రాలలో నటించాడు.
దురదృష్టం కొద్ది అతను ఒక ప్రమాదంలో గాయపడ్డాడు.అతని రూపురేఖలు మారిపోయాయి.
కోలుకోవడానికి విరామం తీసుకున్నాడు.కంబ్యాక్ ఇచ్చాక విలన్ పాత్రలు చేయడం ప్రారంభించాడు.

ఎలాంటి పాత్రనైనా పోషించగల బహుముఖ నటుడునని అరవింద్ స్వామి నిరూపించుకున్నాడు.అవకాశం వస్తే అరవింద్ స్వామితో నటించేందుకు సిద్ధమని తండ్రి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ యాక్టర్ ఢిల్లీ కుమార్ అన్నారు.







