ఫ్రిజ్‌ను మరిపించే బ్యాక్‌ప్యాక్‌ కూలర్‌ బ్యాగ్.. పిక్నిక్స్ సమయంలో ప్రత్యామ్నాయం ఇదే

ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లో మనకు తినే పండ్లు, బీర్లు, కూల్ డ్రింక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.వేసవి సమయంలో చల్లని నీరు కానీ కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది.

 A Backpack Cooler Bag That Forgets The Fridge This Is The Alternative During Pic-TeluguStop.com

అదే యువకులు అయితే సాయంత్రం సమయంలో చల్లని బీర్ తాగడానికి ఇష్డపడతారు.ఇంట్లో ఉన్నంత వరకు ఇది పర్వాలేదు.

అయితే బయటకు వెళ్తే మనకు ఇష్టమైన పానీయాలు, పండ్లు దొరక్కపోవచ్చు.చల్లగా ఉండాలన్నా, తాజాగా ఉండాలన్నా అక్కడ ఫ్రిజ్ ఉండకపోవచ్చు.

దీంతో చాలా మంది బయటకు వెళ్లినప్పుడు నిరాశపడతారు.ఇలాంటి వారికి కెనడా( Canada )కు చెందిన అంకుర సంస్థ కూలి ఐజీ కంపెనీ గుడ్ న్యూస్ అందించింది.

ఓ బ్యాక్ ప్యాక్‌ను అది తయారు చేసింది.దీనిలో మనం కూల్ డ్రింక్స్, బీర్లు, పండ్లు పెడితే అవి 24 గంటల వరకు చల్లగా ఉంటాయి.

దీనిని మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.ముఖ్యంగా ఏదైనా పిక్నిక్‌కు గానీ, ఇతర కొత్త ప్రదేశాలను వెళ్లినప్పుడు ఇది చాలా బాగుంటుంది.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Telugu Backpack, Amazon, Cooler Bag, Cooli, Picnics, Latest, Ups, Forgets, Fridg

కూలీ పేరు( Cooli )తో తయారు చేయబడిన ఈ బ్యాగ్ యువతకు బాగా ఉపయోగపడుతుంది.ఈ కూలీ బ్యాక్‌ప్యాక్ కూలర్ మీ పానీయాలు, స్నాక్స్‌లను 24 గంటల వరకు చల్లగా ఉంచడానికి రూపొందించబడింది.దీనిని లీక్ ప్రూఫ్‌గా తయారు చేశారు.

వీపున తగిలించుకొనే ఈ బ్యాగ్ కూలర్ 18 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.

Telugu Backpack, Amazon, Cooler Bag, Cooli, Picnics, Latest, Ups, Forgets, Fridg

ఇది 20 కూల్ డ్రింక్ క్యాన్లు, లేదా 4 వైన్ బాటిళ్ల వరకు సరిపోతుంది.ఇది మీ విలువైన వస్తువులు, కీలు, ఫోన్ లేదా వాలెట్‌ను నిల్వ చేయగల వేరు చేయగల ఫ్రంట్ పర్సును కూడా కలిగి ఉంది.వీపున తగిలించుకొనే సామాను సంచి కూలర్ మన్నికైన క్లాత్‌తో తయారు చేయబడింది.

ఈ కూలీ బ్యాక్‌ప్యాక్ కూలర్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ( Amazon )ఇతర ఆన్‌లైన్ రిటైలర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.బ్యాక్‌ప్యాక్ కూలర్ ధర రంగు, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.అయితే ఇది 79.99 డాలర్ల నుండి 99.99 డాలర్ల వరకు ఉంటుంది.30-రోజుల రిటర్న్ పాలసీని కూడా కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube