పవన్ “ వేగం” బూమ్ రాంగ్ అయ్యిందా ?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత జరిగిన అనేక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసినట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతాయని రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని పరిస్థితులు అదుపు తప్పుతాయాని మీడియా చేసిన హడావిడిలో పదవ శాతం కూడా జరగకపోవడం నిజంగా పోలీసులు శాఖ సమర్థతా లేక ప్రజలు రాజకీయ వ్యవహారాల పట్ల విసిగిపోయి నిర్లిప్తంగా ఉండిపోయారా అన్నది చాలా మందికి అర్థం కాలేదు.

 Pawan's speed Turned Into Boomerang , Chandrababu Arrest , Pawan Kalyan, Jana-TeluguStop.com

స్వయంగా పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు కూడా ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదని వ్యాఖ్యానించినట్టుగా కొన్ని మీడియాల లో వార్తలు ప్రసారమయ్యాయి.ఇదిలా ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వ్యవహార శైలి గురుంచి కూడా మీడియా లో బాగా చర్చ జరిగినది.

Telugu Ap, Chandrababu, Jana Sena, Mangalagiri, Pawan Kalyan, Ys Jagan-Telugu Po

హుటాహుటిన హైదరాబాద్ నుంచి మంగళగిరి రావడానికి చూపించిన పట్టుదల,ఆయన ప్రయాణాన్ని అడ్డుకోవడానికి పోలీస్ శాఖ చూపించిన అత్యుత్సాహం, ఎక్కడికక్కడ ఆయనను నిలువరించడానికి పోలీసుల ఏర్పాట్లు జనసైనికుల నిరసన ప్రదర్శనలు చివరకు పోలీసులు దగ్గరుండి ఆయనను మంగళగిరి కి చేర్చేవరకూ నిద్రపోకుండా తమ నాయకుడికి అండగా నిలబడిన జనసైనికులు మరియు వీర మహిళల పట్టుదలను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

Telugu Ap, Chandrababu, Jana Sena, Mangalagiri, Pawan Kalyan, Ys Jagan-Telugu Po

ఒక రాజకీయ పార్టీ అధినేతగా తాను తన పార్టీ కార్యాలయానికి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పవన్ పోలీసుల మీద ఫైర్ అవుతుంటే అసలే చంద్రబాబు అరెస్టుతో దిగజారుతాయేమో అన్న పరిస్థితుల నడుమ పవన్ కూడా చంద్రబాబుకు మద్దతు తెలపడానికి ప్రయత్నిస్తే శాంతి బద్రతలు అదుపు చేయడం మరింత కష్టమవుతుందనే కోణంలోనే పవన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించామని పోలీస్ శాఖ చెప్తుంది.అయితే ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన పవన్ కళ్యాణ్ కావాలనే ఉద్దేశపూర్వకంగా హడావిడి చేశారని, చంద్రబాబు అరెస్టుతో ఆయన హర్ట్ అయ్యారని, సొంత కొడుకు కన్నా ఎక్కువగా పవన్ బాధపడుతున్నారని, ఆయన తన ప్రయోజనాల కోసం కాక చంద్రబాబు ప్రయోజనం కోసం నిత్యం బ్రతుకుతున్నారని మరోసారి రుజువు చేశారంటూ వైసీపీ సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా గానీ వరుస కధనాలు ప్రచారం చేసింది.

ఈ ప్రచారం నిజంగా జనసేనకు ఒకరకంగా ఇబ్బందికరమైన పరిస్థితి గా చెప్పవచ్చు.

ఒక మిత్రపక్షంగా మద్దతు తెలపడం వరకు పరవాలేదు కానీ ఆయన బయలుదేరిన సమయం, చేసిన హడావిడి మాత్రం ఒక రాజకీయ పార్టీకి మంచిది కాదని చెప్పవచ్చు.అయితే పవన్ పర్యటన కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమేనని చంద్రబాబుకు మద్దతు సాటి పార్టీగా మాత్రమే మాట్లాడామని ,తమ వారాహి యాత్ర కోసం చర్చించడం కోసం వస్తున్న పవన్ ని అడ్డుకుంటున్నారంటూ జనసేన చెప్తుంది .ఏది ఏమైనా పవన్ ప్రయాణించిన సందర్భం మాత్రం ఆయన పై వైసీపీ అధికార వైసిపి ( YCP )విమర్శలు ఇవ్వడానికి మాత్రం అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube