సిట్ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేష్..!!

సిట్ కార్యాలయంలో దాదాపు మూడు గంటల నుండి అధికారులు చంద్రబాబుని( Chandrababu Naidu ) విచారణ చేస్తూ ఉన్నారు.మధ్యలో బ్రేక్ ఇవ్వటంతో ఆ సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీని,( Bhuvaneshwari ) లోకేష్,( Nara Lokesh ) బ్రాహ్మణినీ కలవడం జరిగింది.

 Bhuvaneshwari And Lokesh Met Chandrababu In Sit Office Details, Tdp, Bhuvaneshwa-TeluguStop.com

కుటుంబ సభ్యులు చంద్రబాబుని పరామర్శించారు.విచారణ బ్రేక్ మధ్యలో కుటుంబ సభ్యులను కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది.

దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు రాత్రంతా విచారించి రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో చంద్రబాబుని కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అరెస్టు చేసిన అనంతరం 24 గంటలలో కోర్టులో హాజరు పరచాలనే నిబంధన ఉండటంతో.ఈ ఉదయం 6 గంటలకు అరెస్టు చేయటంతో రేపు ఉదయం 6 గంటలలోపు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

మరోపక్క చంద్రబాబు తరుపు వాదించడానికి ఢిల్లీ నుండి లాయర్ సిద్ధార్థ లూథ్రా( Sidharth Luthra ) సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది.చంద్రబాబుని సిద్ధార్థ లూథ్రా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాగా సిట్ కార్యాలయం ప్రాంగణంలోనే బాలకృష్ణ( Balakrishna ) కూడా ఉన్నారు.చంద్రబాబుని సీఐడీ అధికారులు విచారణకు కార్యాలయానికి తీసుకెళ్ళిన సమయంలోనే బాలకృష్ణ, బ్రాహ్మణి. హైదరాబాద్ నుండి విమానం ద్వారా విజయవాడకు చేరుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube