టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగుపెట్టారు.దీంతో మహేష్ బాబు భార్య నమ్రత( Namarata ) తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఇలా మహేష్ బాబు ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగు పెట్టడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి మహేష్ బాబు ఇంట్లోకి వచ్చినటువంటి ఆ కొత్త మెంబర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా…పెట్ డాగ్ స్నూపీ( Snoopy )సితార కోసం నమ్రత …పెట్ డాగ్ తీసుకువచ్చారు.
దానికి స్నూపీ అని పేరు పెట్టారు.సితార (Sitara)ప్రస్తుతం ఈ స్నూపీతో ఆడుకుంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇదివరకు సితారతో పాటు ఆడుకోవడానికి తన పెట్ డాగ్ ప్లూటో(Fluto)ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఫ్లూటో గత కొద్దిరోజుల క్రితం మరణించింది ఇలా ఫ్లూటో చనిపోయినప్పుడు సితార చాలా ఎమోషనల్ అయినా సంగతి తెలిసిందే.ఫ్లూటో చనిపోవడంతో సితారలో సంతోషం నింపడానికి దాని స్థానంలో నమ్రత స్నూపీ తీసుకువచ్చారు.ఇక స్నూపీ ఫోటోనే నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపించింది.
ఓవైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ.మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమించబోతున్నామన్న సంతోషం.నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.నిన్ను మరింత ప్రేమిస్తాం అంటూ పోస్ట్ చేశారు.

ఈ విధంగా నమ్రత సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్ ఫోటోని షేర్ చేస్తూ తనకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నమ్రత సితార ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.తన బిజినెస్ లతోపాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.







