టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయవాడలోని కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్లారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబును రక్షించమని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబుకు చేయూతగా నిలవాలని వెల్లడించారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఆమె స్పందించడానికి నిరాకరించారని తెలుస్తోంది.తన బాధను అమ్మవారికి తెలుపుకునేందుకు ఆలయానికి వచ్చినట్లు భువనేశ్వరి వెల్లడించారు.
అయితే ఇవాళ ఉదయం చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మరో రెండు గంటల్లో చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారని తెలుస్తోంది.







