ప్రస్తుత కాలంలో ఎంతోమంది సాధారణ ప్రజలు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం వివిధ రకాల రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంటున్నారు .ఈ క్రమంలోనే తాము చేసే వీడియోలు ఫోటోషూట్లకు మంచి గుర్తింపు రావాలి అన్న ఉద్దేశంతో పెద్ద డబ్బు ఖర్చు చేయడమే కాకుండా కొన్నిసార్లు వారు చేసే పనులు కొందరికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంటాయి.
ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పలు విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా బుల్లితెర నటి లహరి( Lahari ) సైతం ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు.లహరి గత కొద్ది రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈమె తనకు బాబు పుట్టారు అంటూ ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.
దీంతో అభిమానులు అందరూ కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారు.అయితే బాబు పుట్టిన తర్వాత వారం రోజులకే కృష్ణాష్టమి( Krishanastami )రావడంతో ఈమె తన కుమారుడికి కృష్ణుడి వేషం వేశారు.
లహరి యశోదమ్మ వేషం వేయగా తన కుమారుడికి కృష్ణుడి వేషం వేశారు.

ఇలా రోజుల వయసు ఉన్నటువంటి ఈ చిన్నారికి చుట్టూ క్లాత్ చుట్టేసి కృష్ణుడిగా తయారు చేశారు.అయితే ఈ బాబుని ఎత్తుకొని లహరి ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే ఈ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా( Social media ) వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
దీంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఈమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ ఫోటోలు చూసినటువంటి కొందరు నేటిజన్స్ అచ్చం నిజమైనటువంటి యశోదమ్మ కన్నయ్య మాదిరిగానే ఉన్నారు అంటూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం మీ ఫోటోల పిచ్చితో రోజుల వయసు ఉన్నటువంటి ఆ చిన్నారిని అలా మూట కట్టేస్తావా ఇది కరెక్ట్ కాదు అంటూ ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు.

రీల్స్ చేయాలన్న పిచ్చితో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.చాలామందికి పిల్లలు లేక బయట ఎంతో బాధలు అనుభవిస్తున్నారు కానీ మీరు మాత్రం మీ బిడ్డ పట్ల ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు అంటూ నటీ లహరి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.ఇక రోజులు వయసున్న చిన్నారి అంటే వారికి సరిగా మెడ నిలవడం వంటివి కూడా జరగదు అలాంటి సమయంలో లహరి ఇలా ఫోటోషూట్లు చేయించడంతో పలువురు ఈమెపై మండిపడుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







