వైరల్ వీడియో: ఇదెక్కడి పాన్.. చూస్తేనే కడుపులో తిప్పుతోంది...

సోషల్ మీడియా( Social Media ) వ్యాప్తి యే రకంగా వుందో ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలోనే నిత్యం ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు ఇక్కడ వైరల్ అవుతూ ఉంటాయి.

 Avacodo Paan Video Viral Social Media,avacodo Paan,avacodo Meetha Paan,bizzare F-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా మీఠా పాన్‌( Meeta Pan )ని ఎక్కువగా తీసుకుంటారు.

మనదగ్గర కొన్ని ప్రాంతాల్లో పాన్ ను ఎక్కువగా తీసుకుంటూ వుంటారు.మరీ ముఖ్యంగా ఆహారం తీసుకున్న తరువాత దీన్ని ఎక్కువగా తింటూ వుంటారు.

పాన్ తింటే ఆహారం బాగా అరుగుదలకు వస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు.అందుకే ఇక్కడ దానికి అంత డిమాండ్ వుంటుంది.

ఇక దానిని ప్రాంతాన్ని బట్టి రకరకలుగా తయారు చేస్తూ వుంటారు.ఇటీవలి సంవత్సరాలలో, తరిగిన ఖర్జూరాలు, టుట్టీ-ఫ్రూట్టీ, గుల్కంద్, సోపు గింజల తీపి మిశ్రమంతో తమలపాకులను నింపి తయారుచేసే మీఠా పాన్ ను ఎక్కువగా ఇస్తున్నారు.అయితే, ఇప్పుడు అవకాడో పాన్( Avacado Meetha Pan ) వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.పేరుకు తగ్గట్లే ఆ పాన్ లో అవకాడో పాన్ మీఠా పాన్ మిక్స్‌లో అవకాడో ముక్కలను వెయ్యడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

భారతదేశంలో పాన్-ఫోకస్డ్ అవుట్‌లెట్ అయిన యముస్ పంచాయత్‌ను నడుపుతున్న కంటెంట్ సృష్టికర్త అనితా లాల్వానీ సురానా, వారి కన్నాట్ ప్లేస్ లొకేషన్ నుండి అవకాడో పాన్ వీడియోను షేర్ చేసారు.

కాగా ఈ వీడియో( Viral Video )కు ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా లైక్‌లు రావడం గమనార్హం.కాగా కామెంట్స్‌లో, పాన్‌లో అన్యదేశ పండును కలపడంపై చాలా మంది ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.“మీరు అవకాడో పరువుని తీసేశారు.

దానిని ఇక్కడ చాలామంది ఎంతో మక్కువతో తింటూ వుంటారు.దయచేసి ఇలాంటి పనికిమాలిన ప్రయోగాలు చేయకండి!” అని కామెంట్స్ చేయడం మనం కామెంట్స్ సెక్షన్లో చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube