ఆ ఫోటోలు షేర్ చేసిన నిహారిక...స్నేక్ బాబును అక్కడే వదిలిరా అంటూ కామెంట్స్ చేసిన నెటిజన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగా కుటుంబం గురించి చెప్పాల్సిన పనిలేదు మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలు నిర్మాతలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే నాగబాబు సైతం పలు సినిమాలలో నటుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

 Netizens Shocking Comments On Naga Babu, Naga Babu, Tollywood, Niharika Konide-TeluguStop.com

అదేవిధంగా పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా ఈయన తనదైన శైలిలో సందడి చేశారు.అయితే ప్రస్తుతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు.

ఈ విధంగా నాగబాబు రాజకీయాలలో కొనసాగుతూ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.అయితే చాలా రోజుల తర్వాత నాగబాబు( Nagababu ) కుటుంబ సభ్యులందరూ కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం వీరంతా కూడా కెన్యాలో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను నిహారిక ( Niharika ) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ విధంగా కెన్యాలో నిహారిక తన ఫ్యామిలీతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా కొందరు నెటిజెన్స్ ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోలపై కొందరు స్పందిస్తూ సూపర్ క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేయగా మరికొందరు మాత్రం వరుణ్ తేజ్( Varun Tej ) ను ఉద్దేశిస్తూ అన్న వదినమ్మ ఎక్కడ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే అయితే పెళ్లికి ముందు ఈ కుటుంబం మొత్తం ఇలా వెకేషన్ వెళ్లడంతో పలువురు నెటిజన్స్ లావణ్య గురించి కూడా ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు.అయితే ఒక నెటిజన్ మాత్రం నాగబాబును ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా నేటిజన్స్ స్పందిస్తూ ఆ స్నేక్ బాబును కెన్యా( Kenya )లోనే వదిలేసి రా ఒక పని అయిపోతుంది అంటూ నేటిజన్ చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.ఇలా మెగా కుటుంబం గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం అయితే తమ ఫ్యామిలీపై ట్రోల్స్ శృతి మించితే మాత్రం నాగబాబు తన స్టైల్ లో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారనే విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube