ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప ది రూల్’.ఈ సినిమా టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి.
ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో సీక్వెల్ గా తెరకెక్కుతున్న పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.
అందుకే ఈసారి పార్ట్ 2 ను మరిన్ని హంగులతో, భారీ సీక్వెన్స్ లతో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూట్ సగానికి పైగానే పూర్తి అయ్యింది.
స్టార్ట్ చేయడం లేట్ అయినప్పటికీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.ఈ సినిమా పార్ట్ 1 లో దేవి శ్రీ అందించిన పాటలు కూడా కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే.పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి.ఇక పార్ట్ 2 కోసం కూడా అదే రేంజ్ లో ఇవ్వడానికి దేవి శ్రీ కష్ట పడుతున్నాడు…

ఇదిలా ఉండగా దేవి శ్రీ ప్రసాద్ తాజాగా పుష్ప 2 పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.ఈ సినిమాను సుకుమార్ పార్ట్ 1 ను మించిపోయేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అలానే మూవీలో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేయడం అయ్యిందని కూడా తెలిపారు.ఇక ఈ సీక్వెల్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశం అందరిని థ్రిల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna )అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.







