క్షేత్రస్థాయిలో ప్రచారం కన్నా సోషల్ మీడియాలోనూ, ఆన్లైన్ పోలింగ్ సైట్స్ లోనూ జనసేన( Janasena ) ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పవచ్చు.ఎందుకంటే జనసేనకు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న యువత డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఆక్టివ్ గా ఉంది జనసేన ను ఒక అడుగు ముందే నిలబెడుతున్నారు.
అందుకే ఆన్లైన్ ఓటింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడు జనసేనకే ఎడ్జ్ ఉంటుందని చెప్పవచ్చు.అంతేకాకుండా నూతన శైలి లో ప్రచారం చేయడం లో కూడా జనసేన ప్రచార విభాగం శతఘ్ని దూసుకెళ్తూ ఉంటుంది.
ఇప్పుడు దానికి తగ్గట్టే నా మొదటి ఓటు జనసేనకే పేరుతో ఒక సరికొత్త నినాదాన్ని జనసేన పార్టీ ప్రచారం చేస్తుంది.ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ఈ నినాదంతో కూడిన డిజిటల్ వల్ల పోస్టర్ ను మీడియా సమావేశంలో ఈరోజు విడుదల చేశారు.
ముఖ్యంగా యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కు ఈసారి కొత్తగా ఓటు హక్కు పొందబోతున్న మరో నాలుగు లక్షల ఓటర్లు తోడు కాబోతున్నారని, వారంతా తమ మొదటి ఓటును జనసేనకే వేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి వారిలో ఆ స్పూర్తి ని తీసుకురావడానికి ఈ కొత్త నినాదాన్ని జనసేన అందుకున్నట్లుగా తెలుస్తుంది.

అయితే అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని గట్టిగా చెప్పలేని ఒక పార్టీకి మొదటి ఓటు తమకు వెయ్యమని అడిగే నైతిక అర్హత అసలు ఏముందంటూ వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంలో జనసేనకు కౌంటర్లు ఇస్తుంది.అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం లో కూడా జనసేన పోటీ చేస్తుందన్న నమ్మకం లేదని అలాంటప్పుడు తమ అధ్యక్షుడే తన పార్టీకి ఓటు వెయ్య లేనటువంటి విచిత్రమైన పరిస్థితి జనసేనకు ఎదురవచ్చని, అలాంటప్పుడు మొదటి ఓటు వెయ్య మని ఇతరులను అడగాల్సిన అవసరం ఏముందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు .అయితే విమర్శలు ఎలా ఉన్నప్పటికీ యువతలో తమ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంటున్న జనసేన ఈ నినాదంతో తమకు మరింత యువత మద్దతు దక్కుతుందని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తుంది.







