ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు.ఈ మేరకు చంద్రబాబుకు 2024 లో రానున్న ఎన్నికలే చివరివి అని తెలిపారు.
బోగస్ కంపెనీలు పెట్టి కోడ్ భాషలో డబ్బులు కొట్టేశారని మంత్రి సీదిరి ఆరోపించారు.చంద్రబాబు లాంటి అవినీతిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పారు.
చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మోదీ దగ్గరకు రానివ్వడం లేదన్నారు.లోకేశ్ పాదయాత్రలో వైసీపీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు.
ప్రశ్నిస్తాననే దత్తపుత్రుడు ఎక్కడున్నారన్న మంత్రి సీదిరి వారాహి యాత్ర చేసిన పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.ఇంటికి సూట్ కేస్ వస్తేనే బస్సు ఎక్కుతారా అని ఎద్దేవా చేశారు.
జన సైనికుల కష్టాన్ని ఆశయాలను పవన్ తాకట్ట పెట్టారని విమర్శించారు.







