Abhijeet : భారత్ మాతాకీ జై అంటూ ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం చేస్తున్న అభిజిత్.. నిజంగా గ్రేట్ అంటూ?

బిగ్ బాస్ షో( Bigg boss season 4 ) ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.కొంతమంది బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుండగా మరికొందరు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

 Bigg Boss Season 4 Winner Abhijeet Plowing The Field On A Tractor-TeluguStop.com

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం వెండితెరకు అటు బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు.అతను మరెవరో కాదు హీరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్( Abhijeet )బిగ్బాస్ సీజన్ ఫోర్ లో విన్నర్ గా రాణించిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ తర్వాత మళ్లీ హీరోగా ఫుల్ బిజీ బిజీ అవుతాడు అని అందరూ భావించారు.

కానీ అందరూ అనుకున్న విధంగా జరగలేదు.బిగ్ బాస్ తర్వాత అభిజిత్ ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో మాత్రమే నటించాడు.అభిజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

రకరకాల ప్లేస్ లకు వెళ్లడం.దూర ప్రయాణాలు చేయడం అతడికి అలవాటు.

అందుకు తగ్గట్టుగా రకరకాల బైక్స్ కూడా తెచ్చుకుంటున్నాడు.అయితే అతడు నడుము, కళ్ళకు సర్జరీలు చేయించుకున్నారని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఇటీవల కథలు వింటున్న త్వరలోనే సినిమాలలోకి ఎంట్రీ ఇస్తా అని చెప్పాడు కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అభిజిత్ తన ఇంస్టాగ్రామ్( Instagram ) ఖాతాలో ఒక వీడియోని షేర్ చేయగా అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో అభిజిత్ ట్రాక్టర్ తోలుతూ వ్యవసాయం చేస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ భారత్ మాతాకీ జై టు క్యాప్షన్ కూడా జోడించారు.

ఆ వీడియో చూసిన నెటిజన్స్ అభిమానులు అభిజిత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.కొందరు అభిమానులు మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ అడుగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube