రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది.బుద్వేల్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎంను కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధిత విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు.
అయితే విద్యార్థులకు సరిగా డ్రైవింగ్ రాకపోవడం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థులు కాలేజీ మానేసి కారును అద్దెకు తీసుకుని షికారు కొడుతున్నారని తెలుస్తోంది.
అయితే విద్యార్థులకు సరిగా డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని భావిస్తున్నారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.
.






