1.తిరుమలలో మరో రెండు చిరుతలు

తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మరో రెండు చిరుతపులుల కదలికలు చిక్కాయి.ట్రాప్ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించిన అటవీ అధికారులు రెండు చిరుతల సంచారాన్ని గుర్తించారు.
2.ఏపీ విద్యాసంస్కరణలు బేష్
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకేల్ క్రేమోర్ ప్రశంసించారు.
3.కేశినేని నాని కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని , అవినీతి మచ్చలేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని అన్నారు.
4.రేవంత్ రెడ్డి విమర్శలు
హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయింది అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
5.పేదవారిని ధనికులుగా చేస్తా

ప్రజలే నా ఆస్తి, మీ ద్వారా సంపద సృష్టించి పేదలను ధనుకులుగా చేసి చూపిస్తానని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.
6.సిపి రంగనాథ్ కు రఘునందన్ సవాల్
సిపి రంగనాథ్ కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారని ,వరంగల్ సిపి రంగనాథ్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.ఈ కేసులో సిపి ప్రవర్తన అనుమానదాస్పదంగా ఉందని ,వ్యవస్థలను ఎందుకు మేనేజ్ చేయాలనుకుంటున్నారని లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిపి సిద్దమా అని రఘునందన్ సవాల్ విసిరారు.
7.రాష్ట్రపతి విందుకు అందని ఆహ్వానం

జి 20 దేశాధినేతల గౌరవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు ఆహ్వానం అందలేదు.
8.మోదికి మన్మోహన్ సింగ్ ప్రశంస
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ మద్దతు ఇచ్చారు.శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం , ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైనదేనని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
9.హోంగార్డు మృతి పై కిషన్ రెడ్డి విచారం

హోంగార్డ్ రవీందర్ మృతి చెందడంపై కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
10.టిడిపి ఇన్చార్జిల నియామకం
అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి ఇన్చార్జిలను నియమించింది .కడప , గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.కడప అసెంబ్లీ ఇన్చార్జిగా మాధవి రెడ్డి , గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ బి రామాంజనేయులును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
11.తిరుమల సమాచారం

తిరుమలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది.నేడు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది .
12.నేటి నుంచి ఐసెట్ ద్రువ పత్రాల పరిశీలన
తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా ఈరోజు నుంచి అధికారులు, అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలించమన్నారు.
13.ఎంబిబిఎస్ రెండో విడత ప్రవేశాల గడువు పొడగింపు

ఎంబిబిఎస్ రెండో విడత ప్రవేశాల గడువును కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగించింది.రెండో విడత సీట్లు కేటాయింపు పూర్తయిన తర్వాత కళాశాలలో చేరేందుకు గడువు ముగియగా దీన్ని ఈరోజు సాయంత్రం వరకు పెంచింది.
14.బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం నేడు తెలంగాణ బిజెపి కార్యాలయంలో ప్రారంభమైంది .కేంద్ర మంత్రి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
15.కలప పరిశ్రమల లైసెన్సులకు ఆన్లైన్ దరఖాస్తు లు

ఏపీలో సామిల్లులు, కలప ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ,వాటి సామర్థ్యం పెంపుదలకు కావలసిన లైసెన్సులను ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
16.జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం
ఏపీలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలని లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30న ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
17.మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి

మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిరక్షణకు మీడియా కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
18. అవినాష్ బెయిల్ రద్దు పై విచారణ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
19.20 నుంచి అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 20 నుంచి జరుగుతాయి అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
20.రాజమండ్రి జైలుకు యువ గళం వాలంటీర్లు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర భీమవరంలో జరిగిన సమయంలో ఏర్పడిన ఘర్షణ వ్యవహారంలో 36 మంది టీడీపీ నేతలు, యువ గళం వాలంటీర్లను అరెస్టు చేసిన పోలీసులు వారిని రాజమండ్రి జైలుకు తరలించారు.







