యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చే బీసీ ఆర్ధిక సహాయం బీసీ బంధు అని చెప్పడం సిగ్గుచేటని,అది బీసీ బంధు కాదు బీఆర్ఎస్ బంధు అని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు వంగూరి శ్రీశైలం యాదవ్( Vanguri Srisailam Yadav ) అన్నారు.మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే బీసీ బంధు ఇచ్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని, నిరుపేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రానున్న రోజుల్లో బీసీల సత్తా ఏమిటో చూపేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.







