సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ జరిగిన విషయాలన్నా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెట్రోలో రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.
అవును, మెట్రో ట్రైన్స్ ని( Metro Trains ) లవర్స్ వారికి అడ్డాగా మార్చుకుంటున్నారు.ఈ క్రమంలో కన్నుమిన్ను కానకుండా రెచ్చిపోతున్నారు.
చుట్టూ ఎవరున్నా కూడా పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువ అయిపోవడం చాలా విచారకరం.
తాజాగా అలాంటి మరో ఘటన సోషల్ మీడియాలో వెలుగు చూసింది.అవును, రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.అది చూసిన వారంతా వారిని మందలించినప్పటికీ వారి ప్రపంచం వెరన్నట్టు ముద్దుల్లో మునిగి తేలిపోయారు.అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
విషయంలోకి వెళితే, రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్( love couple romance ) మొదలెట్టింది.దీంతో ఆ పక్కనే వున్న ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి వారిని మందలించింది.
ఢిల్లీ మెట్రో( Delhi Metro ) రైల్లో అపుడు కనీసం కాలు తీసి కాలు పెట్టడానికి కూడా చోటు లేదు.ఆ సమయంలో ఉన్నట్టుండి ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ ప్రేమ జంట చుట్టూ ఉన్న జనాన్ని అస్సలు పట్టించుకోకుండా తమ రొమాన్స్ లో వారు మునిగిపోయారు.ఇద్దరూ హత్తుకుని ఉండడంతో పాటూ ముద్దులు పెట్టుకుంటూ తాకరాని చోట తాకుతూ రొమాన్స్ చేసుకుంటున్నారు.
ఇక వీరిద్దరూ చేస్తున్న చెండాలాన్ని చూసిన ఓ ఆంటీ కోపంతో రగిలిపోయింది.జనాలు చుట్టూ ఉన్నారని కొంచెం కూడా బుద్ది లేదా అంటూ ఒంటికాలుపై లేచింది.చెడా మడా తిట్టేసింది.దాంతో వారు “మా ఇష్టం మాది.
మధ్యలో మమ్మల్ని నిలదీయడానికి నువ్వెవరు” అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.దాంతో అంతా షాక్ అయ్యారు.